కర్నూలు: సుంకేసుల రిజర్వాయర్‌కు మంగళవారం వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ నుంచి 44,520 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోందని డ్యాం జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో రిజర్వాయర్ నుంచి 10 గేట్లను ఎత్తి దిగువకు 42,420 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు, అలాగే కేసీ కెనాల్ కాల్వకు 2,095 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.