ASR: జనన, మరణ దృవీకరణ పత్రాలు జారీకి నోటరీ చేయాలని ఇబ్బందులు పెడితే రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం తహసీల్దారులు, సర్వేయర్లతో వీసీ నిర్వహించారు. రెవెన్యూపరంగా జారీచేసే దృవపత్రాలకు అఫిడివిట్లతో పనిలేదన్నారు. అఫిడివిట్లు అడిగితే తీవ్రంగా పరిగణించి, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.