Jr.NTR : ట్రిపుల్ ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ వేడుక కోసం ట్రిపుల్ ఆర్ టీమ్ అంతా అమెరికాకు వెళ్లింది. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. తెల్లవారు జామున రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ట్రిపుల్ ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ వేడుక కోసం ట్రిపుల్ ఆర్ టీమ్ అంతా అమెరికాకు వెళ్లింది. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. తెల్లవారు జామున రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ వస్తున్నాడని సమాచారం తెలియడంతో.. అర్ధరాత్రి నుంచి ఎయిర్ పోర్ట్ దగ్గర వెయిట్ చేశారు. ఇక ఎన్టీఆర్‌ను చూసిన తర్వాత, అన్నా.. అన్నా.. జై ఎన్టీఆర్ నినాదంతో ఎయిర్ పోర్ట్ దద్దరిల్లింది. అలాగే ఎన్టీఆర్‌ను రిసీవ్ చేసుకోవడం కోసం ప్రణతి కూడా ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా.. అవార్డు వచ్చిన విషయం తొలుత తన భార్యతో షేర్ చేసుకున్నట్లు తెలిపాడు ఎన్టీఆర్. ఆస్కార్ వేడుకలో బెస్ట్ మూమెంట్ ఏది? అని అడగ్గా.. ‘కీరవాణి, చంద్రబోస్ స్టేజి మీద నిలబడినప్పుడు, అదే నా బెస్ట్ మూమెంట్ అని అన్నాడు. ఆస్కార్ అవార్డు పట్టుకున్నప్పుడు ఫీలింగ్ ఏంటని అడగ్గా.. ‘చాలా బరువుగా ఉంది.. మన దేశం ఎంత బరువుగా ఉందో, అవార్డు కూడా అంతే బరువుగా ఉంది. అదో అద్భుతమైన అనుభూతి.. ఎన్నిసార్లు చెప్పినా చాలదు. చాలా చాలా ఆనందంగా ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఎన్టీఆర్ హైదరాబాద్‌కు వచ్చేశాడు కాబట్టి.. మార్చి 18న ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్‌ని గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. అయితే మార్చి 17న విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా రాబోతున్నాడు తారక్. మొత్తంగా తారక్‌కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అభిమానులు.