MDK: నెలవారీ తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఈవీఎం గోదాంను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంల భద్రత, సీసీ కెమెరాలు, అగ్ని ప్రమాద నివారణ, డబుల్ లాక్ వ్యవస్థలను సమీక్షించారు. భద్రతా సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఎన్నికల పారదర్శకతకు ఈవీఎంల భద్రత కీలకమని పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు.