ASR: గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హ్యూమన్ రైట్స్ మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు డా. కమ్మిడి కృష్ణకుమారి సూచించారు. ఆదివారం అరకులోయ APTWRS (PTG) పాఠశాలను సందర్శించిన ఆమె, విద్యార్థులతో మాట్లాడారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడితే భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. చెడు వ్యసనాలు అనేక సమస్యలకు దారి తీస్తాయని తెలిపారు.