సినీ నటుడు, వైసీపీ నేత అలీ ఇంట శుభకార్యం జరిగింది. ఆయన కుమార్తె వివాహాన్ని అంగ రంగ వైభవంగా నిర్వహించారు. సినీ పెద్దలు చాలా మంది ఈ వేడుకకు హాజరై… నూతన వధూ, వరులను ఆశీర్వదించారు. అయితే… అలీకి అత్యంత సన్నిహితుడైన పవన్ మాత్రం… ఈ పెళ్లికి హాజరు కాకపోవడం గమనార్హం. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అలీ, పవన్… మంచి స్నేహితులు అని అందరీ తెలుసు. అయితే.. రాజకీయంగా వారి మధ్య వచ్చిన దూరం కారణంగానే పవన్ హాజరుకాలేదని తెలుస్తోంది.
లీ పెళ్ళికి పిలవలేదు.. అందుకే పవన్ వెళ్ళలేదు అని కొందరు అంటుండగా.. మరికొందరు మాత్రం ఆలీ వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి పవన్ వద్దకు వెళ్లినా ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆలీ నిరాశగా వెనుతిరిగారని చెప్పుకొస్తున్నారు.
అలీ.. జనసేన కాకుండా.. పదవి లభించడంతో వైసీపీలో కంటిన్యూ అవ్వడమే.. వీరిద్దరి మధ్య దూరం పెరగడానికి కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ కావాలనే ఆలీకి దూరంగా ఉంటున్నాడు. ఆలీని కలవడం పవన్ కు చిటికెలో పని.. కానీ, ఆయన కావాలనే కలవలేదు. ముందు చెప్పినట్టుగానే ఆలీ స్నేహంతో రాజకీయాలు వద్దు అనే ఆయన దూరంగా ఉన్నారని తెలుస్తోంది.