ELR: జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరిన విషయం తెలిసిందే. కామయ్య పాలెం, బర్రింకలపాడు కేంద్రాలకు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు స్పందించిన అధికారులు వెంటనే బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.