అప్పుడప్పుడు కొన్ని హాలీవుడ్ సినిమాలు టాలీవుడ్‌ని భయపెడుతుంటాయి. అవతార్ లాంటి సినిమా రిలీజ్ అయినప్పుడు.. ఒక్క టాలీవుడ్‌నే కాదు, ఇండియాలో మరో సినిమా రిలీజ్‌కు కూడా భయపడిపోయారు. ఇక ఇప్పుడు ఆక్వామేన్ టాలీవుడ్‌ని భయపెట్టేలా కనిపిస్తున్నాడు. కానీ తెలుగులో కాదులేండి!
సంక్రాంతి, దసరా తర్వాత సినిమా సీజన్ అంటే డిసెంబర్ నెలనే. ప్రస్తుతం వచ్చే డిసెంబర్లో టాలీవుడ్లో వరుస సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా క్రిస్మస్ టార్గెట్‌గా చాలా సినిమాలు థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. డిసెంబర్ 21 న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘హాయ్ నాన్న’.. డిసెంబర్ 22న ‘సైంధవ్’, ‘హరోం హర’.. డిసెంబర్ 23న నితిన్ ఎక్స్ ట్రాడినరి మెన్ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అలాగే బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘డంకీ’ సినిమా కూడా 22న రిలీజ్ కానుంది.
అయితే అదే నెలలో హాలీవుడ్ నుంచి డిసెంబర్ 20న ‘ఆక్వామెన్ లాస్ట్ కింగ్ డమ్’ సినిమా భారీ ఎత్తున విడుదలకు సిద్దమవుతోంది. తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది చూసిన తర్వాత మరో విజువల్ వండర్ మూవీ అనక తప్పదు. ట్రైలర్‌ను అద్భుతమైన విజువల్స్‌తో కట్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆక్వామేన్ విజువల్స్ చూస్తే మతి పోవడం గ్యారెంటీ అనేలా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై చూడాలనిపించేలా ఉంది.
కాబట్టి తెలుగులో ఆక్వామేన్ ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోయినా.. ఓవర్సీస్లో మాత్రం ఆక్వామెన్ వల్ల థియేటర్ల కొరత ఖచ్చితంగా ఉంటుంది. అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఫస్ట్ ప్రయార్టి ఇంగ్లీష్ సినిమాలకే ఉంటుంది. కాబట్టి ప్రీమియం స్క్రీన్లన్నీ ఆక్వామేన్ కబ్జా చేసేస్తుంది. ఈ విషయంలో ఇప్పటి నుంచే తెలుగు సినిమాలు పక్కా ప్లాన్ చేసుకుంటే బెటర్ అని చెప్పొచ్చు.