యూట్యూబర్ సునిశిత్ ఇటీవల మెగా కోడలు ఉపాసన(upasana) పై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.తాజాగా సునిశిత్ (Sunishit) మరో సారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
యూట్యూబర్ సునిశిత్ (Sunishit) మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశాడు.ఈసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సునిశిత్.. ‘జూనియర్ ఎన్టీఆర్ పెద్ద హీరో. కానీ ఆయన పోర్న్ సినిమాలు చేశాడు. ఈ విషయం టాలీవుడ్(Tollywood) లో సునిశిత్ అనే హీరో తప్ప ఎవరూ చెప్పరని చెప్పుకొచ్చాడు. ఇంకా ఈ ఇంటర్వ్యూలో పలువురు సెలబ్రిటీల మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసాడు సునిశిత్. ‘బ్రహ్మానందం(Brahmanandam)పై మర్డర్ కేసు ఉందని, మంచు విష్ణు, ప్రభాస్‌ల మీద రేప్ కేసులున్నాయని, హీరోయిజం చూపించి పోలీసుల నుంచి తప్పించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇక సూపర్ స్టార్ మహేశ్‌బాబు(Mahesh Babu)ను డీఫేమ్ చేస్తున్నానని వాళ్లబ్బాయి గౌతమ్ తనతో గొడవపడ్డాడని, పేషియల్ చేయించుకోవడానికి మహేశ్‌బాబుతో యూఎస్ వెళ్లానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు.దీంతో అది తెలుసుకున్న ఫ్యాన్స్ ఆగ్రహం తో ఊగిపోతూ మొన్ననే కదా చితకబాదింది బుద్ధి రాలేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.