సోషల్ మీడియా పుణ్యమా అని.. స్టార్ హీరోల అభిమానుల మధ్య వార్ ఓ రేంజ్లో ఉంటుంది.. తమ అభిమాన హీరోల గురించి ఏదో ఒక విషయాన్ని హైలెట్ చేస్తూ.. సోషల్ మీడియా ట్రెండ్ చేస్తునే ఉంటారు. అయితే ఇప్పుడు సుడిగాలి సుధీర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. పోయిన వారం గాలోడు సినిమా రిలీజ్ అయినా ఈ నేపథ్యంలో..
ఓ ఇంట్రెస్టింగ్ పోల్ నిర్వహించారు కొందరు. అయితే ఈ సారి బన్నీ, సుధీర్ మధ్య పోటీ పెడుతూ ఆ పోల్ నిర్వహించారు. ‘మీకు ఎవరంటే ఇష్టం.. ఓపెన్‌గా చెప్పండి’ అంటూ పెట్టిన ఈ పోల్‌కు వేలమంది రియాక్ట్ అయ్యారు. ఇందులో సుడిగాలి సుధీర్‌కు 69 శాతం ఓట్లు రాగా.. బన్నీకి 31 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని చెబుతున్నారు. దీనిపై బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతుండగా..
యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ఇది బన్నీ రేంజ్ అని యాంటీ బ్యచ్ అంటుండగా.. ఇది ఎవరో కావాలనే చేశారని.. బన్నీ బ్యాచ్ అంటోంది. అయినా.. అసలు ఐకాన్ స్టార్ రేంజ్‌కు సుధీర్‌తో పోలికేంటని అంటున్నారు కొందరు బన్నీ అభిమానులు. ఏదేమైనా సరే.. ఈ పోల్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇకపోతే ప్రస్తుతం ‘గాలోడు’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం.. మంచి వసూళ్లు సాధిస్తున్నట్టు చెబుతున్నారు మేకర్స్. ముఖ్యంగా బీ,సీ సెంటర్లలో గాలోడు హవా గట్టిగానే ఉందంటున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రం.. నాలుగు కోట్లకు పైగా గ్రాస్.. రెండు కోట్లకు పైగా షేర్ వసూలు చేసి లాభాల బాట పట్టిందని అంటున్నారు మేకర్స్.