Actress Shriya: ఇదే ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం ఉందా.. శ్రియ ఫైర్
హాట్ బ్యూటీ శ్రియ శరణ్ గురించి అందరికీ తెలిసిందే. నాలుగు పదుల వయసులోను క్రేజీ ఆఫర్స్‌తో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. అది కూడా పెళ్లై, పిల్లలు పుట్టాక కూడా. అంతేకాదు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ అవుతునే ఉంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన సీరియస్ కామెంట్స్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.
శ్రియ(Actress Shriya) హీరోయిన్గా కెరీర్ మొదలు పెట్టి రెండు దశాబ్దాలు దాటిపోయింది. ఈ మధ్యలో వచ్చిన ఎందరో హీరోయిన్లు అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయారు. శ్రియ మాత్రం సౌత్ జెండా పాతేసింది. తెలుగులో మెగాస్టార్(Megastar) మొదలుకొని.. దాదాపుగా అందరు స్టార్ హీరోలతోను అమ్మడు రొమాన్స్ చేసింది. 22 ఏళ్ల సినీ కెరీర్లో దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ స్టాటస్‌ను అనుభవించింది శ్రియ. అయితే 2018లో ఆండ్రూని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు పాప కూడా ఉంది.. కూతురు పేరు రాధ(Radha). అయినా గ్లామర్ విషయంలో శ్రియ తగ్గేదేలే అంటోంది. రోజు రోజుకి అమ్మడి అందం పెరుగుతోంది తప్పా తగ్గడం లేదు. సినిమాలు కూడా అలాగే చేస్తోంది.
ప్రస్తుతం సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా శ్రియ(Shriya) మాత్రమే ఉంది. రీసెంట్‌గానే కబ్జా మూవీ(Kabja Movie)తో ఆడియెన్స్ ముందుకొచ్చింది శ్రియ. అయితే తాజాగా ఓ ఈవెంట్ అడెంట్ అయింది శ్రియ. ఈ సందర్భంగా.. పెళ్లయిన తర్వాత కూడా మీరు ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటని అడిగాడు ఓ రిపోర్టర్. దాంతో శ్రియకు గట్టిగానే కోపం వచ్చింది. ఎందుకు హీరోయిన్లను మాత్రమే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు? ఇదే ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం మీకు ఉందా? అంటూ సీరియస్ అయింది. వాళ్ళను అడిగిన రోజునే నేను సమాధానం చెబుతానని.. ఫైర్ అయింది. ప్రస్తుతం శ్రియ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి.