ATP: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఈ వారం జరిగిన పశువులు, జీవాల సంతల ద్వారా రూ.4.12 లక్షలు మేర ఆదాయం వచ్చినట్లు చైర్పర్సన్ బల్లా పల్లవి తెలిపారు. అందులో శనివారం జరిగిన గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల సంత ద్వారా రూ.2.47 లక్షలు, ఆదివారం జరిగిన పశువులు, గేదెలు, ఎద్దుల సంత ద్వారా రూ.1.65 లక్షలు మేర వసూలు అయినట్లు అధికారులు తెలిపారు.