నంద్యాల: పట్టణంలోని జగజ్జనని ఏరియా బీబీనగర్ సమీపంలోని మస్జిద్-ఏ-సఅద్ బిన్ అబీ వఖ్ఖాస్ మసీదులో రంజాన్ 28, 29వ రోజుల్లో ప్రత్యేక తరావీలు నిర్వహించనున్నారు. మార్చి 17, 18 తేదీలలో రాత్రి 8 గంటలకు జమాత్తో రెండు రోజుల్లో పూర్తి ఖురాన్ తరావీలు చదివించనున్నట్లు మసీదు కమిటీ ఇవాళ తెలిపింది. తెల్లవారుజామున సైరి ఏర్పాట్లు ఉంటాయని పేర్కొన్నారు.