నిజామాబాద్ పొట్టి శ్రీరాములు చౌరస్తాలో పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు పాల్గొని ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడిగా పొట్టి శ్రీరాములు సేవలను స్మరించారు.