NRPT: దామరగిద్ద మండలంలోని గత్ప సర్పంచ్ ఆవుటి మల్లమ్మ గ్రామ అభివృద్ధికి పలు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామపంచాయతీ ఆవరణలో ఉన్న వెలగని పాత ఐమాస్ట్ లైట్‌కు తన సొంత నిధులతో మరమ్మతు చేయించారు. ఇన్నాళ్లు లైటు లేని కారణంగా బాటసారులు పొలాలకు వెళ్లే రైతులు ఇబ్బందిగా ఉండేదని ఆవేదన వ్యక్తం చేసేవారు. ఐమాస్ట్ స్తంభానికి నూతన లైట్ అమర్చిన కారణంగా బల్బు వెలగడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.