KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ కీ.శే. గోనెల విజయలక్ష్మి దశ దిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ హాజరయ్యారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఎమ్మెల్యే ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబసభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.