WGL: రాయపర్తి మండల కేంద్రంలో గ్రామస్థులకు తాగునీరందించేందుకు రాయపర్తి గ్రామపంచాయతీ కార్మికులు సోమవారం సాహసమే చేశారు. గ్రామంలో తాగునీటి సరఫరాకు ఉన్న 8 బోరు బావుల్లో రెండు పాడవగా, గ్రామ శివారులోని బతుకమ్మ చెరువులో ఉన్న విద్యుత్ మోటార్ కాలిపోయింది. దీంతో ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు నడుములోతు నీటిలోకి దిగి మోటార్ నుబయటకు తీశారు.