కాకినాడ రూరల్, సిటీతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న 11 అన్న క్యాంటీన్లకు పూర్తిస్థాయిలో గ్యాస్ సరఫరా జరుగుతోంది. దీంతో అన్న క్యాంటీన్లు యధాప్రకారం పనిచేస్తున్నాయి. రూరల్, సిటీలోని కొన్ని హోటళ్లు గ్యాస్ లేక పోవడంతో కట్టెల పొయ్యిపై ఆధారపడ్డాయి. కానీ అన్న క్యాంటీన్లను అత్యవసర సర్వీసులుగా గుర్తించి గ్యాస్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.