ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(Allu Arjun), డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) కాంబోలో వచ్చిన ‘పుష్ప’ సినిమా(Pushpa Movie) గురించి అందరికీ తెలిసిందే. ఈ మూవీలో అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అందులో ‘నువ్ అమ్మీ అమ్మీ అంటాంటే నీ పెళ్లాన్నైపోయినట్టుందిరా సామి’ సాంగ్(Sami sami song) బాగా పాపులర్ అయ్యింది. అప్పట్లో ఆ సాంగ్ యూట్యూబ్‌ను ఓ ఊపు ఊపేసింది. చిన్నవారి దగ్గరి నుంచి పెద్దవారి వరకూ ఈ సాంగ్ కు స్టెప్పులేసి నెట్టింట వీడియోలు రిలీజ్ చేశారు. తెలుగులో ఆ పాటను మౌనిక యాదవ్ పాడగా తమిళంలో రాజ్యలక్ష్మి(Singer Rajyalakshmi) పాడింది.
ఈ పాటతో పాటు సింగర్స్(Singers) కూడా బాగా ఫేమస్ అయ్యారు. గాయనిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రాజ్యలక్ష్మి(Singer Rajyalakshmi) ఇప్పుడు కథానాయికగా ఎంట్రీ ఇస్తోంది. బుల్లితెరపై ఆమె మొదటగా సూపర్ సింగర్స్ షోతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇప్పుడు హీరోయిన్గా వెండితెరపై కనిపించనుంది. రాజ్యలక్ష్మి హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం లైసెన్స్(Licence Movie).
30 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లల తల్లి అయిన తాను హీరోయిన్గా నటిస్తానని ఊహించలేదని రాజ్యలక్ష్మి(heroine Rajyalakshmi) తెలిపారు. లైసెన్స్ మూవీ(Licence Movie) కోసం డైరెక్టర్ ఫోన్ చేసి కథ చెప్పారని, అంత ప్రాధాన్యత ఉన్న పాత్రను తాను చేయగలనా అని అనుకున్నానన్నారు. కథానాయికగా ఆ పాత్రకు తాను తప్పా వేరే చాయిస్ లేదని డైరెక్టర్ చెప్పడంతో నటించానని ఆమె తెలిపింది. తనకు సినిమాలో ఛాన్స్ రావడం పట్ల రాజ్యలక్ష్మి ఆనందం వ్యక్తం చేసింది.