Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి..తండ్రి సీరియస్!
మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh) గురించి అందరికీ తెలిసిందే. కానీ ఆమె ఎవరితో లవ్‌లో ఉంది? అనే విషయం మాత్రం తెలియడం లేదు. చాలా రోజులుగా కీర్తి ఫలానా వ్యక్తితో లవ్‌లో ఉందని ప్రచారం జరుగుతునే ఉంది. పెళ్లి వార్తలు కూడా వస్తునే ఉన్నాయి. తాజాగా అలాంటి వార్తలే మళ్లీ వైరల్ అయ్యాయి. దాంతో కీర్తి తండ్రి సీరియస్ అయ్యారు.
మహానటిగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్(Keerthy Suresh).. రీసెంట్గా దసరా సినిమాలో వెన్నెలగా అదరగొట్టేసింది. కానీ మహానటి సినిమా తర్వాత.. పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వెనకబడిపోయింది. అయితే మహేష్ బాబు సరసన నటించిన సర్కారు వారి పాటలో కీర్తి ఊహించని విధంగా గ్లామర్ డోస్ పెంచేసి షాక్ ఇచ్చింది. అప్పటి నుంచి కీర్తి హాట్ హాట్ గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తునే ఉంది. అయితే కీర్తి లవ్ మ్యాటర్ మాత్రం తేలడం లేదు. ఎప్పటికప్పుడు కీర్తి ఫలానా హీరోతోనో, లేదంటే ఫలానా వ్యక్తితోనే లవ్‌లో ఉందనే రూమర్స్ వినిపిస్తునే ఉన్నాయి.
కానీ ఇప్పటి వరకు ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు మహానటి. అయితే ఇటీవల ఫర్హాన్ బిన్ లియాఖత్ అనే వ్యక్తి బర్త్ డే జరుపుకున్నాడు. ఈ సందర్భంగా హ్యాపీ బర్త్ డే ఫర్హానీ.. అని కీర్తిసురేశ్ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ధన్యవాదాలు కిట్టీ అని రిప్లై ఇచ్చాడు ఫర్హాని. అతనికి కీర్తి ప్రేమగా బర్త్ డే విష్ చేయడం.. అతను కూడా కీర్తి సురేష్‌కి అదే రేంజ్లో రిప్లే ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఖచ్చితంగా అతను కీర్తి బాయ్‌ఫ్రెండే(boy friend)నని ఫిక్స్ అయిపోయారు. ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అని కూడా తెలిసింది. అతనితో కీర్తి పెళ్లి అనే టాక్ ఊపందుకుంది.
అయితే ఇవన్నీ రూమర్స్ అని కీర్తి తల్లి కొట్టి పారేసింది. కీర్తి సురేష్ కూడా సమయం వచ్చినప్పుడు తానే చెబుతానని చెప్పింది. అయినా పుకార్లు ఆగడం లేదు. దాంతో కీర్తి తండ్రి(father)నే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఫర్హాన్ తమకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని.. కీర్తి, ఫర్హాన్ మధ్య అలాంటి సంబంధమేమీ లేదని చెప్పాడు. అలాగే కీర్తికి ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని.. ఒక వేళ పెళ్లి కుదిరితే తానే స్వయంగా చెప్తానంటూ సీరియస్ అయ్యారు. నిజ నిజాలు తెలుసుకోకుండా రాసే వార్తల వల్ల..మెంటల్‌గా డిస్టర్బ్ అవుతున్నామంటూ చెప్పారు. మరి ఇప్పటికైనా కీర్తి పెళ్లి పుకార్లకు చెక్ పడుతుందేమో చూడాలి. ఇకపోతే.. ప్రస్తుతం కీర్తి మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్‌లో చిరు చెల్లెలిగా నటిస్తోంది. అలాగే మలయాళం, తమిళం, తెలుగు భాషల్లోను నటిస్తోంది.