»Hero Lawrence Raghavendra Latest Update On Chandramukhi 2 2023
Chandramukhi 2: చంద్రముఖి 2 వచ్చేస్తోంది..!
నటుడు రాఘవ లారెన్స్ నటించిన 'చంద్రముఖి 2(Chandramukhi 2) మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయినట్లు చిత్రబృందం వెల్లడించింది.
హిట్ అయిన సినిమాకు సీక్వెల్స్ రావడం సహజం. అయితే.. సినిమా వచ్చిన దాదాపు 17 ఏళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చంద్రముఖి విషయంలో అదే జరిగింది. రజినీకాంత్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ సినిమాగా దీనిని చెప్పొచ్చు. ఈ మూవీని అప్పట్లో అన్నిభాషల్లోనూ చిత్రీకరించారు. ఈ మూవీకి సీక్వెన్స్ లాంటిదనే చెప్పాలి.. నాగవల్లి తీశారు. కానీ అది అస్సలు ఆకట్టుకోలేదు. కాగా..ఇప్పుడు మళ్లీ చంద్రముఖి 2(Chandramukhi 2) పేరిట సీక్వెల్ తీస్తున్నారు.
దాదాపు 17ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. లారెన్స్(Lawrence Raghavendra) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది. హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇక ఈ సినిమాను వినాయక చివితి సందర్భంగా సెప్టెంబర్ మాసంలో రిలీజ్ చేయాలని మేకర్స్(makers) సన్నాహాలు చేస్తున్నారు. కంగానా రనౌత్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో రాధికా శరత్కుమర్, వడివేలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్(lyca productions) బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచాయి. నిజానికి చంద్రముఖి విజయం తర్వాత రజినీతోనే సీక్వెల్‌ను పట్టాలెక్కించాలని దర్శకుడు p.వాసు ఎంతో ప్రయత్నించాడు. కానీ అది కుదరలేదు.