సత్యసాయి: పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో జిల్లాలో వంట గ్యాస్ సరఫరాపై అడ్డంకులు ఏర్పడ్డాయి. వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో జిల్లాలో గృహ వినియోగ సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. గత నాలుగు రోజుల నుంచి ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో బుకింగ్లు కావడం లేదని ప్రజలు వాపోతున్నారు.