Rana Daggubati చేస్తే అద్భుతమైన సినిమాలే చేయాలి : రానా దగ్గుబాటి
Rana Daggubati: చేస్తే అద్భుతమైన సినిమాలు చేయాలి. లేదంటే అసలు సినిమాలే చేయనకూడదు అంటున్నారు రాణా దగ్గుబాటి. లీడర్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయి తన నటనతో అందరినీ మెప్పించారు రానా. ఎప్పుడూ ఏడాదికి మూడు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉండేవారు. అయితే బాహుబలి తర్వాత ఆయన సినిమాలను ఆచితూచి ఎంచుకుంటున్నారు.
Rana Daggubati: చేస్తే అద్భుతమైన సినిమాలు చేయాలి. లేదంటే అసలు సినిమాలే చేయనకూడదు అంటున్నారు రాణా దగ్గుబాటి. లీడర్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయి తన నటనతో అందరినీ మెప్పించారు రానా. ఎప్పుడూ ఏడాదికి మూడు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉండేవారు. అయితే బాహుబలి తర్వాత ఆయన సినిమాలను ఆచితూచి ఎంచుకుంటున్నారు. ఎక్కువ గ్యాప్ వచ్చినా పట్టించుకోవడం లేదు. ఇదే విషయంపై ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తాజాగా రానా… “రానా నాయుడు” అనే వెబ్ సిరీస్ ప్రమోషన్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు.
తాను కెరియర్ మొదట్లో సంవత్సరానికి కనీసం మూడు సినిమాలైనా చేయకపోతే జనాలు మర్చిపోతారేమో అని సినిమాలు చేయాల్సిన వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు తానెవరో ఇండియా మొత్తానికి తెలుసునన్నారు. కాబట్టి సినిమాలను ఎంచుకునేప్పుడు చాలా సెలెక్టివ్‌గా ఉంటున్నానని చెప్పారు. స్క్రిప్ట్ సెలెక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నానన్నారు. చేస్తే మంచి సినిమాలు మాత్రమే చేయాలని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. అందుకనే బాహుబలి తర్వాత తక్కువ సినిమాల్లో మాత్రమే కనిపిస్తున్నానని తెలియజేశారు. ఇదిలా ఉండగా “రానా నాయుడు” వెబ్ సిరీస్ నెట్ ఫిక్స్ లో మార్చి 10వ తేదీ నుంచి స్ట్రీమ్ కాబోతోంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ విడుదల కాబోతోంది.