ప్రకాశం: ఇష్టపడి చదివి, మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని APUWJ రాష్ట్ర అధ్యక్షులు IV సుబ్బారావు విద్యార్థులకు సూచించారు. బుధవారం మార్కాపురంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల మహోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై, క్రీడా పోటీలను ప్రారంభించారు. రోజురోజుకు పెరుగుతున్న పోటీ ప్రపంచంలో విద్యతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఎంతో అవసరమన్నారు.