ఆదిపురుష్ సినిమా టీజర్ డిసప్పాయింట్ చేయడం ఒకటైతే.. ఇప్పుడు ఈ సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నారనే వార్తలతో.. మరింతగా నిరాశకు గురవుతున్నారు అభిమానులు. ‘ఆదిపురుష్’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకొని.. సమ్మర్లో సోలోగా వచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరో బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. అయితే ప్రభాస్(Prabhas) థియేటర్లోకి రావడానికి.. లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నాడని తెలియడంతో.. నిరీక్షణ తప్పేలా లేదంటున్నారు.
వచ్చే ఏడాది ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె(Project K) సినిమాలతో.. ప్రభాస్ నామస్మరణంగా మారనుందని అనుకున్నారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ కె మరింత వెనక్కి వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ‘సలార్’ను సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అలాగే ప్రాజెక్ట్ కెను వీలైతే 2023 అక్టోబర్ 18.. లేదంటే 2024 సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు నిర్మాత అశ్వినీదత్ వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ భారీ బడ్జెట్ మూవీ 2024 వేసవి కానుకగా.. ఏప్రిల్‌లో రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
అతి త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్సమెంట్ రానుందని అంటున్నారు. ఇదే జరిగితే ఆరు నెలల గ్యాప్‌తో ప్రభాస్ సినిమాలు రిలీజ్ కానున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ప్రాజెక్ట్ కెలో దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తున్నారు. మహానటి తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.