RR: మైలార్దేవ్ పల్లి పరిధిలో రౌడీ షీటర్ ఉల్లా ఖాన్ హల్చల్ సృష్టించాడు. మద్యం మత్తులో ఇద్దరిని డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. వారు నిరాకరించడంతో కత్తితో మహమ్మద్ ఫరీస్, మహమ్మద్ ఇస్మాయిల్‌పై దాడి చేశాడు. గాయపడిన వారిని స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.