»On The 9th A Program To Honor The Natu Natu Song Group
Silpakala vedika : 9న నాటు నాటు సాంగ్ బృందానికి సన్మాన కార్యక్రమం
నాటు నాటు’ పాటతో (Natu Natu' song) విశ్వవేదికపై తెలుగోడి సత్తాచాటిన సంగీత దర్శకులు కీరవాణి(Keeravani),రచయిత చంద్రబోస్‌ను తెలుగు సినీ పరిశ్రమ సన్మానించనుంది. ఈ నెల 9వ తేదీన శిల్పకళా వేదికలో (Silpakala vedika) సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ (Damodar Prasad) తెలిపారు.
నాటు నాటు’ పాటతో (Natu Natu’ song) విశ్వవేదికపై తెలుగోడి సత్తాచాటిన సంగీత దర్శకులు కీరవాణి(Keeravani),రచయిత చంద్రబోస్‌ను తెలుగు సినీ పరిశ్రమ సన్మానించనుంది. ఈ నెల 9వ తేదీన శిల్పకళా వేదికలో (Silpakala vedika) సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ (Damodar Prasad) తెలిపారు. కార్యక్రమంలో సినీ పరిశ్రమకు (Film Industry) చెందిన నటీ నటులు, నిర్మాతలు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులు పాల్గొంటారని వివరించారు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు (Oscar Award) వరించిన సంగతి తెలిసిందే. ఇటీవలే కీరవాణి, చంద్రబోస్ స్వదేశం చేరుకున్నారు. తర్వాత కీరవాణి కరోనా వైరస్ బారినపడటంతో సన్మాన కార్యక్రమం ఆలస్యమైంది. ఆయన కోలుకోవడంతో 9వ తేదీన సన్మానించనున్నారు.