HYD నగరంలో వాహనాల సరాసరి వేగం 20KMPH దాటడం లేదని అర్బన్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ టెండ్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. వాహనాల సంఖ్య, ఇరుకైన రహదారులు, సిగ్నల్ సమన్వయం లోపం కారణాలుగా పేర్కొన్నారు. రోజూ ట్రాఫిక్‌లో గంటల తరబడి గడపాల్సి రావడంతో ప్రజల విలువైన సమయం వృథా అవుతోంది. ఇంధన వినియోగం పెరిగి కాలుష్యం తీవ్రతరం అవుతోందని పేర్కొంది.