ఎన్టీఆర్-చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయి నెలలు గడుస్తున్నాయి. ఓ వైపు చరణ్ వరుస సినిమాలతో పాటు.. యాడ్స్ కూడా చేస్తున్నాడు. కానీ ఎన్టీఆర్ 30ని మాత్రం సెట్స్ పైకి తీసుకెళ్లడం లేదు కొరటాల శివ. ఇటీవలె ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయినట్టు.. మ్యూజిక్ సిట్టింగ్ మొదలైనట్టు చెప్పినా కూడా.. సాలిడ్ అప్టేట్ కావాలంటున్నారు. ఇక ఇదిలా ఉండగానే..
ఓ వార్తతో మరింత హర్ట్ అవుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ సినిమాలతో పాటు కమర్షియల్‌గా దూసుకుపోతున్నాడు. అలాగే పుష్ప తర్వాత బన్నీ కూడా వరుస యాడ్స్‌తో దూకుడు మీదున్నాడు. ఒక్కో యాడ్‌కు బన్నీ, చరణ్ 7 నుంచి 8 కోట్ల పారితోషికం అందుకుంటున్నారనే వార్తలు వినిపిస్తునే ఉన్నాయి.
కానీ తారక్ విషయంలో మాత్రం అలా జరగడం లేదని వినిపిస్తోంది. కమర్షియల్‌గా కాస్త గ్యాప్ ఇచ్చి.. రీసెంట్గా ఓ యాడ్‌లో మెరిశాడు ఎన్టీఆర్. దాంతో ఆ యాడ్ కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకొని ఉంటాడని అంతా భావించారు. కానీ ఇప్పుడు తారక్ రెమ్యూనరేషన్ చూసి షాక్ అవుతున్నారు అభిమానులు. లిసియస్ అనే యాడ్ కోసం కేవలం రెండు కోట్లు మాత్రమే ఛార్జ్ చేశాడట.
దాంతో మిగతా హీరోలతో పోల్చుకుంటు.. ఎన్టీఆర్ మరీ అంత తక్కువ తీసుకున్నాడా.. అతని రేంజ్ ఇంతేనా అనే చర్చ జరుగుతోంది. దాంతో ఎన్టీఆర్ ఎందుకిలా చేస్తున్నాడని వాపోతున్నారు అభిమానులు. అయితే మరో వెర్షన్ ప్రకారం.. తారక్ చేసింది కేవలం తెలుగు యాడ్ మాత్రమే కాబట్టి.. అంత తక్కువ పారితోషికం అందుకున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌ను నిరాశ పరుస్తునే ఉన్నాడు ఎన్టీఆర్.