మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. తల్లి అంజనా దేవి జన్మదినం సందర్భంగా ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు సోదరిమణులు ఒక్క చోటకు చేరారు. వారితో పాటు వారి పిల్లలు, కోడళ్లు, మనుమలు, మనువరాళ్లతో చిరంజీవి నివాసం సందడిగా మారింది. జనవరి 29 చిరంజీవి తల్లి జన్మదినం. ప్రతి యేటా ఆమె పుట్టిన రోజును కుటుంబసభ్యులు అందరి కలిసి ఘనంగా నిర్వహిస్తారు. గతేడాది కరోనా కారణంగా చిరంజీవి దూరంగా ఉన్నారు.
తాజాగా ఆదివారం తల్లి జన్మదినాన్ని చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు, విజయదుర్గ, మాధవితో కలిసి నిర్వహించారు. తల్లితో కేక్ కట్ చేయించి ఆమె ఆశీర్వాదం పొందారు. వీరితో పాటు రామ్ చరణ్ – ఉపాసన దంపతులు పాల్గొన్నారు. నాన్నమ్మకు చరణ్ ముద్దు చేయగా.. ఉపాసన కౌగిలించుకుంది. వీటికి సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో చిరంజీవి పంచుకుంటూ పోస్టులు చేశారు. ‘మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ పుట్టినరోజు. జన్మజన్మనలు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే అమ్మ’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య విజయోత్సవ సంబరాల్లో చిరంజీవి మునిగి తేలుతున్నారు. ఇక పవన్ కల్యాణ్, నాగబాబు ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.
మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ పుట్టిన రోజు. 💐💐 జన్మజన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటూ… 🙏Happy Birthday అమ్మ !! pic.twitter.com/SH2h5HBNN7