మహేష్ బాబు కొత్త సినిమా థియేటర్లోకి రావడానికి ఇంకా ఏడు నెలలకు పైగా సమయం ఉంది. కానీ అప్పుడే ఎస్ఎస్ఎంబీ 28 బాక్సాఫీస్ లెక్కల గురించి చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు టార్గెట్ కూడా ఫిక్స్ అయిపోయిందని అంటున్నారు. ‘సర్కారు వారి పాట’ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న సినిమా రిలీజ్ కానుంది.
అయితే అప్పుడే ఈ మూవీ బిజినెస్ లెక్కలు తెరపైకొచ్చాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఎస్ఎస్ఎంబీ28 మేకర్స్ భారీగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓవర్సీస్ రైట్స్ కోసం 20 కోట్లకు పైగా.. డిజిటల్ రైట్స్ కోసం100 కోట్లు.. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 140 కోట్లకు అటు ఇటుగా ఉంటుందని అంటున్నారు. మొత్తంగా ఈ సినిమా బిజినెస్ టార్గెట్ 250 కోట్లకు పైగానే ఫిక్స్ చేసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుపుతున్నారట మేకర్స్. దీనికి కారణం పుష్కర కాలం తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబో సెట్ అవడమే అని అంటున్నారు. అయితే ఇలాంటి లెక్కల్లో ఎంత వరకు వాస్తవముందనేది ఇప్పుడే చెప్పలేం.. దానికి చాలా సమయం ఉంది. ఒకవేళ నిజమైతే మహేష్, త్రివిక్రమ్ భారీ టార్గెట్‌తో బరిలోకి దిగబోతున్నారని చెప్పొచ్చు.