BPT: సూర్యఘర్’ పథకం ద్వారా బాపట్ల జిల్లాలోని 5 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో మొత్తం 24,620 గృహాలకు సౌర విద్యుత్ అందించాలని సీపీడీసీఎల్ అధికారులకు బుధవారం సూచించారు. ముఖ్యంగా పిట్టలవానిపాలెం, కొత్తపేట, కారంచేడు, కనగాల, యడ్లపల్లి గ్రామాల్లో 100% సౌర యూనిట్ల ఏర్పాటు పూర్తి చేయాలని ఆదేశించారు.