WNP: ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2న నిర్వహించే గ్రామ సభలను పండుగ వాతావరణం లో నిర్వహించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం వనపర్తి కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో సభ నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.