పెద్ద హీరో సినిమా ఏదైనా సరే.. గాసిప్స్ కొదవే ఉండదు. అసలు అందులో నిజం ఏంత.. అనే విషయం పక్కకు పెట్టి.. ఆ వార్తను మరింత వైరల్ చేస్తుంటారు. ఇప్పుడు మహేష్ బాబు లేటెస్ట్ ప్రాజెక్ట్ SSMB 28 అలా సెట్స్ పైకి వెళ్లిందో లేదో.. అప్పుడే పలు పుకార్లు మొదలయ్యాయి. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూట్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీకి మార్చరాని తెలిసింది. సినిమాలో హైలెట్‌గా నిలిచేలా హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్టు వార్తలొచ్చాయి. అందుకోసం కెజియఫ్ ఫైట్ మాస్టర్స్ అన్బు, అరివ్ బ్రదర్స్‌ను రంగంలోకి దింపినట్టు గతంలోనే చెప్పుకున్నాం.
దాంతో ఈ సారి మహేష్ యాక్షన్ నెక్ట్స్ లెవల్ అనేలా ఉంటుందని హ్యాపీ ఫీల్ అవుతున్నారు అభిమానులు. అయితే ఇప్పుడు మహేష్‌కు ఫైట్ మాస్టర్లు నచ్చలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు షూట్ చేసిన యాక్షన్ సీన్స్ అవుట్ పుట్ పై మహేష్, త్రివిక్రమ్ అసంతృప్తిగా ఉన్నారని టాక్. అంతేకాదు ఈ షెడ్యుల్‌ని క్యాన్సిల్ కూడా చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఫైట్ మాస్టర్స్‌ను మార్చి కొత్త షెడ్యూల్ ప్లానింగ్‌లో ఉన్నారని భోగట్టా. అయితే కెజియఫ్, విక్రమ్ వంటి సినిమాల్లో హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చేసిన ఫైట్ మాస్టర్స్.. మహేష్‌కు నచ్చకపోవడం ఏంటనేది.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పైగా సలార్‌కు కూడా వాళ్లే పని చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. మరి చిత్ర యూనిట్ దీనికి చెక్ పెడతారా.. లేదా నిజంగానే సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఏదో జరుగుతుందా.. అనేది క్లారిటీ రావాల్సి ఉంది.