సలార్ సినిమా వాయిదా పడడంతో.. సెప్టెంబర్ 28న వచ్చేందుకు రెడీ అయ్యాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఇప్పుడు మళ్లీ ఈ డేట్ నుంచి షిప్ట్ అయిపోయాడు. దీంతో మరోసారి రూల్స్ రంజన్ సినిమా పోస్ట్ పోన్ అయింది. మరి కిరణ్ ఎందుకు ఈ సినిమాను వాయిదా వేశాడు?
Is the young hero scared? 'Rules Ranjan' postponed!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో బడా బడా సంస్థలు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాయి. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్.. ఆ తర్వాత వెంటనే ఎస్ఆర్ కళ్యాణ మండపంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత రేసులో వెనకపబడిపోయాడు. సెబాస్టియన్, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణుకథ సినిమాలతో ఆకట్టుకోలేకపోయాడు. దాంతో ఈసారి ‘రూల్స్ రంజన్’తో హిట్ కొట్టాలని గట్టిగానే ఫిక్స్ అయిపోయాడు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్గా ట్రైలర్ విడుదల చేయగా సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.
డీజే టిల్లు బ్యూటి నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్‌కు రెడీ అయ్యారు. ఆ రోజు రావాల్సి సలార్ పోస్ట్‌పోన్ అవడంతో.. రూల్స్ రంజన్‌ను ఆ రోజు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్టే ప్రమోషన్స్ కూడా చేశారు మేకర్స్. కానీ ఇప్పుడు మరోసారి రూల్స్ రంజన్ సినిమాను వాయిదా వేశారు. ఈ సినిమాని వారం వెనక్కి పంపుతున్నట్టు ప్రకటించారు. అక్టోబర్ 6కి ఈ సినిమాను వాయిదా వేశారు. సెప్టెంబర్ 28న స్కంద, చంద్రముఖి 2 లాంటి సినిమాలు రిలీజ్ అవుతుండడంతో.. రూల్స్ రంజన్ సినిమాని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. స్కంద మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుండగా.. చంద్రముఖి 2 సౌత్ లోని అన్ని భాషల్లో రిలీజ్ అవుతోంది. అందుకే.. రూల్స్ రంజన్ భయపడి వెనక్కి తగ్గినట్టుగా చెబుతున్నారు.