»If You Do A Movie With Sara Ali Khan You Will Get Married
Sara Ali Khan: ఆమెతో సినిమా చేస్తే పెళ్లైపోయినట్టే!
బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనతో పని చేసిన వారంతా పెళ్లి చేసుకున్నారని చెప్పుకొచ్చింది. ఆ నలుగురు కూడా స్టార్ హీరోలు, హీరోయిన్లే కావడం విశేషం.
Sara Ali Khan: ఆదిపురుష్‌లో రావణుడిగా, ఎన్టీఆర్ 30లో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ (Sara Ali Khan). సుశాంత్ సింగ్ సరసన ‘కేదార్ నాథ్’ అనే చిత్రంతో సారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఆమె కలిసి నటించిన నలుగురు హీరోల పెళ్లిలు అయిపోయి.. లైఫ్ లో సెటిలయ్యారు.
సినిమా సెట్లో ఉండగానే వీళ్లందరికీ పెళ్లి అయిపోయిందని సారా అలీఖాన్ (Sara) చెప్పుకొచ్చింది. సారా (Sara) సరసన నటించిన హీరోల్లో రణవీర్ సింగ్ ముందుగా పెళ్లి చేసుకున్నాడు. సారా నటించిన రెండో సినిమా సింబా విడుదలకు ముందే.. దీపికా పదుకొనేను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత గ్యాస్ లైట్ సహనటుడు విక్రాంత్ మాస్సే తో కలిసి నటించింది. ఆయన కూడా శీతల్ ఠాకూర్‌ని వివాహం చేసుకున్నాడు. ఇక యంగ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన.. కూలీ నంబర్ 1 విడుదలైన నెల తర్వాత.. నటాషా దలాల్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఇక సారాతో (Sara) కలిసి నటించి పెళ్లి చేసుకున్న నాలుగో వ్యక్తిగా విక్కీ కౌశల్ ఉన్నాడు. 2021లో కత్రినా కైఫ్‌ని పెళ్లి చేసుకున్నాడు విక్కీ కౌశాల్. ఇదే విషయాన్ని ‘జరా హాట్కే జరా బచ్కే ట్రైలర్’ లాంచ్ ఈవెంట్లో చెప్పుకొచ్చింది సారా.
తనతో షూటింగ్ సమయంలో పెళ్లి చేసుకున్న నాల్గవ నటుడు విక్కీ కౌశల్ అని చెప్పుకొచ్చింది. దీనికి విక్కీ నవ్వుతూ.. ఎవరికైనా పెళ్లి కావాలంటే ఆమెతో కలిసి నటించమని చెప్పాడు. సారా కూడా ఎవరైనా నాతో సినిమాకి సంతకం చేయండి.. నా ఎనర్జీలో ఏదో ఉందని వారంతా పారిపోయి పెళ్లి చేసుకుంటారు.. అని సరదాగా వ్యాఖ్యానించారు.