ప్రస్తుతం పవర్ స్టార్ ‘హరిహర వీరమల్లు’ సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ సినిమా మొదలు పెడతాడని అంతా భావించారు. కానీ ఇప్పుడు అసలు ఈ ప్రాజెక్ట్‌లో హీరోనే మారిపోయాడని తెలుస్తోంది. ‘భవదీయుడు భగత్ సింగ్(bhavadeeyudu Bhagat Singh)’ అనే ప్రాజెక్ట్‌ను ఎప్పుడో ప్రకటించారు. గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాంబో సెట్ అవడంతో.. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ పవన్ రాజకీయం కారణంగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం లేదు.
గద్దలకొండ గణేష్ తర్వాత మూడేళ్లుగా పవన్ డేట్స్ కోసమే ఎదురు చూస్తున్నాడు హరీష్ శంకర్(Harish Shankar). మధ్యలో పవన్‌ను కలవడం.. త్వరలోనే అప్టేట్ రాబోతోందని ఊరించడం తప్పితే.. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ గురించి మాత్రం చెప్పలేకపోయాడు. దాంతో ఇప్పుడు ఏకంగా మరో హీరోతో ‘భవదీయుడు భగత్ సింగ్’ చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ పై హత్యకుట్ర జరుగుతోందనే వార్తలు వస్తునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. పవన్ ఇంకా సెట్స్ పైకి తీసుకెళ్లని సినిమాలను హోల్డ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది.
దాంతో హరీష్ మరో హీరో కోసం ట్రై చేస్తున్నాడట. అయితే ఇప్పట్లో మన స్టార్ హీరోల డేట్స్ దొరికేలా లేవు. అందుకే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌తో ఈ ప్రాజెక్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. అందుకోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట. ప్రస్తుతం ముంబైలోనే మకాం వేశాడని.. సల్మాన్‌ను కలిసి కథ కూడా నెరేట్ చేశాడని టాక్. సల్మాన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం.. వెంటనే ‘భవదీయుడు భగత్ సింగ్’ స్టార్ట్ చేయడం ఖాయమంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. త్వరలోనే దీని పై క్లారిటీ రానుందని టాక్.