VSP: వీఎంఆర్డీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ.. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ పనుల్లో నిమగ్నమయ్యే మహిళా ఉద్యోగులకు ఇటువంటి కార్యక్రమాలు ఆటవిడుపుగా నిలుస్తాయని అన్నారు. దీంతో వారు మరింత ఉత్సాహంతో విధులు నిర్వహించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.