MDK: హవేలీ ఘన్పూర్ మండల వ్యాప్తంగా సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నష్టపోయిన పంటలను అధికారులు పరిశీలించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలలో వడగళ్ల వాన కురవడంతో వరి పంటకు తీవ్ర నష్టం ఏర్పడింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల వ్యవసాయ అధికారి బాల్రెడ్డి క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు.