PDPL: సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మంగళవారం ప్రారంభించారు. రామగుండం సింగరేణి సంస్థ అన్ని బొగ్గు గనులు, డిపార్ట్మెంట్లపై కార్మిక సంఘం నాయకులు, కార్మికులు ప్ల కార్డులతో నిరసన చేపట్టారు. అధికారులకు వినతి పత్రాలను అందజేశారు.