ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కింద ప్రస్తుతం అందుతున్న రూ. 1,000 కనీస నెలవారీ పెన్షన్ ఏమాత్రం సరిపోదని దీనిని తక్షణమే గౌరవప్రదమైన స్థాయికి పెంచాలని పార్లమెంటరీ ప్యానెల్ ప్రతిపాదించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర కార్మిక శాఖకు సిఫార్సు చేసింది. పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా ఈ మొత్తాన్ని సమగ్రంగా సమీక్షించాలని కమిటీ సూచించింది.