KMM: కామేపల్లి మండలం కొత్త లింగాల కోట మైసమ్మ ఆలయంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఉగాది జాతర మహోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారి వేణుగోపాలాచార్యులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. జాతరలో భాగంగా విఘ్నేశ్వర పూజ , అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకోవాలని ఆయన కోరారు.