ఆదిలాబాద్ జిల్లాలో రెండు మూడు రోజుల్లో శనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మార్కెఫెడ్ DM ప్రవీణ్ తెలిపారు. క్వింటాల్‌కు రూ. 5,875 మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయనుందని పేర్కొన్నారు. రైతులు తమ పంటను శుభ్రపరిచి, తేమ శాతం 14% మించకుండా ఆరబెట్టి కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. గ్రామాల వారీగా కేటాయించిన తేదీల్లోనే పంటను తేవాలన్నారు.