AP: బాపట్ల జిల్లా రేపల్లెలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. ‘వైసీపీ ఫ్లెక్సీల తొలగింపులో.. మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం చూపారు. మహిళ నాయకురాలిపై దౌర్జన్యం చేశారు. బీసీ నేతను అవమానించారు. 26 మంది వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారు. కేసులపై న్యాయపోరాటానికి సిద్ధం’ అని పేర్కొన్నారు.