NGKL: సెల్ ఫోన్ల కోసం విద్యార్థులు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం సరైంది కాదని అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని ఒక పాఠశాల సైన్స్ ఫెయిర్లో పాల్గొన్న ఆయన, విద్యార్థులు రీల్స్ పిచ్చితో జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. బాల్య దశలో సెల్ ఫోన్ల మోజులో పడకుండా, చదువుపైనే పూర్తి శ్రద్ధ వహించాలని విద్యార్థులకు హితవు పలికారు.