NLG: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరుస్తూ, మహాత్మా గాంధీ పేరును తొలగించే ప్రయత్నం చేస్తోందని చిట్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు గుడిపాటి లక్ష్మీనరసింహ విమర్శించారు. చినకాపర్తి, బోయగుబ్బ, తాళ్లవెల్లంలలో పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ రాజశేఖర్ రెడ్డి, సర్పంచులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన కూలీలకు అవగాహన కల్పించారు.