మద్యం అలవాటుపై తన వ్యాఖ్యలను వక్రీకరించిన మీడియా సంస్థలపై నటి జాన్వీ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అమహా’ సంస్థ నిర్వహించిన పాడ్కాస్ట్లో ఆమె మాట్లాడిన మాటలను కొన్ని సంస్థలు తప్పుగా చిత్రించాయి. తన వ్యక్తిగత అనుభవాలను కేవలం అవగాహన కోసమే పంచుకున్నానని, వాస్తవాలను తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేయవద్దని ఆమె కోరింది. ఈ మేరకు సదరు సంస్థలు కూడా వివరణ ఇచ్చాయి.