ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు భాగం అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్లో జాయిన్ కూడా అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక సన్‌పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనె కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.