డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా మూవీ తీయబోతున్నాడనే విషయం తెలిసిందే. దీనికి అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించబోతున్నారు. ఇందు కోసం లోకేష్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడని తెలుస్తోంది. కాగా ఈ మూవీలో హీరోయిన్గా రచిత రామ్ని ఎంపిక చేశారని సమాచారం. లోకేష్ దర్శకత్వం వహించిన కూలీలో రచిత కళ్యాణి పాత్ర పోషించిన విషయం తెలిసిందే.