సూపర్ స్టార్ మహేష్ బాబు తన తమ్ముడి పిల్లల పుట్టినరోజు వేడుకల్లో సందడి చేశాడు. మహేష్ చిన్నాన్న, నిర్మాత ఆదిశేషగిరి రావు తనయుడు బాబీ ఘట్టమనేని కవల పిల్లల మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు మహేష్ బాబు తన సతీమణి నమ్రతతో కలిసి హాజరై చిన్నారులను ఆశీర్వదించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.